బాబుకు మద్దతుగా న్యూజెర్సీలో తెలుగు ప్రజల ప్రదర్శన
చంద్రబాబు విడుదల కావాలంటూ భారీ ర్యాలీ

న్యూజెర్సీ: చంద్రబాబు అరెస్టుపై రోజురోజుకూ నిరసన గళం పెరుగుతోంది. ఇప్పటికే ఏపీ , హైదరాబాద్ తో పాటు జాతీయ స్థాయిలో కూడా స్పందిస్తున్నారు. తాజాగాఅమెరికాలో పెద్దఎత్తున తెలుగు ప్రజలురోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబుకు మద్దతు పలికారు. న్యూజెర్సీలో చంద్రబాబు కు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన లో పాల్గొన్నారు. తెలుగుదేశం- జనసేన జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ చేశారు. ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు తీసుకొచ్చిన విద్యా ప్రమాణాలు వల్లే తాము విదేశాల్లో స్థిరపడ్డామని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.

న్యాయం కావాలి, చంద్రబాబు విడుదల కావాలనే నినాదాలతో అమెరికా రోడ్లపై ప్రవాసాంధ్రులు కదం తొక్కారు. ,చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ అమెరికా వీధుల్లో తెలుగు ప్రజలు హోరెత్తించారు. అంతే కాకుండా , సైకో పోవాలి- సైకిల్ రావాలి .. అనే నినాదాలతో భారీ ర్యాలీ జరిపారు. ఏపీ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేశారు.
సినిమా వార్తల కోసం ‘తెర’ క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/movies/