వడ్డీ రేట్లలో మార్పు లేదు..ఆర్‌బీఐ

RBI Monetary Policy Decision By Governor Shaktikanta Das

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారంనాడు జరిపిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. రెపో రేటు 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ఎఫ్), బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగుతాయని చెప్పారు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి.


మ‌రోవైపు 2022 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను జీడీపీ వృద్ధి రేటు అంచ‌నాను 9.5 శాతానికి త‌గ్గించింది. గ‌తంలో ఇది 10.5 శాతంగా ఉంటుంది ఆర్బీఐ అంచ‌నా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గ‌తంలో 26.2 శాతంగా అంచ‌నా వేసినా.. తాజాగా దానిని 18.5 శాతానికి త‌గ్గించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/