బ్రెజిల్ అధ్యక్షుడిపై ప్రజల ఆగ్రహం

అధ్యక్షుడి ప్రసంగం వేళ గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసనలు

బ్రెజిల్: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సెనారోపై సొంత దేశ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరోనా మహమ్మారి వెలుగు చూసిన మొదట్లో బొల్సొనారో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. అది చిన్న ఫ్లూ మాత్రమేనని మొదట్లో ఆయన చాలా తేలికగా కొట్టిపడేశారు. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి పెరిగింది. ఒక దశలో రోజుకు నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి. నిన్న కూడా లక్ష కేసులు, రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

బుధవారం సాయంత్రం టెలివిజన్‌లో బొల్సొనారో ప్రసంగిస్తున్న వేళ ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. బొల్సొనారో మాట్లాడుతూ.. ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. ఆర్థిక వృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగిస్తుండగానే ప్రజలు గిన్నెలతో శబ్దాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/