అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం

టైర్ల గోదాములో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు

Massive fire in Afzal Gunj
Massive fire in Afzal Gunj

Hyderabad: అప్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న టైర్ల గోదాములో మంటలు వ్యాపించాయి. సెంట్రల్ లైబ్రరీ వద్ద నిల్వ ఉంచిన టైర్లకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీని కారణంగా చాదర్ ఘాట్ – అఫ్జల్‌గంజ్‌ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అల్లుకుంది. అక్కడే పూరిగుడిసె లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఆస్తి నష్టం భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/