రావణాసుర నుండి మూడో సాంగ్ రాబోతుంది

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర నుండి మూడో సాంగ్ రాబోతుంది. ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ఎందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ దృష్టి సారించారు. ఇప్పటికే సినిమాలోని రెండు సాంగ్స్ విడుదలై ఆకట్టుకోగా..తాజాగా మూడవ పాట వేయినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియోను మార్చి 15న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. పాట ప్రోమోకు సంబంధించిన ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హీరోయిన్ మేఘా ఆకాష్ తో చిలిపి రొమాన్స్ చేస్తూ రవితేజ ఈ పాటలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.