వైజయంతీ బ్యానర్లో నటించబోతున్న శ్రీకాంత్ తనయుడు

ఫ్యామిలీ హీరోగా..విలన్ గా సత్తా చాటిన సీనియర్ హీరో శ్రీకాంత్..తన కొడుకు రోషన్ ను సైతం ఇండస్ట్రీ కి పరిచయం చేసారు. ‘నిర్మలా కాన్వెంట్’ మూవీ తో గ్రాండ్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్..ఆ తర్వాత పెళ్లి సంద D మూవీ చేసాడు. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా విజయం సాధించలేకపోయాయి. ఈ తరుణంలో రోషన్ కు మెగా బ్యానర్ లో నటించే ఛాన్స్ దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ఓ సినిమా చేయబోతున్నాడు రోషన్. ఈరోజు రోషన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ విషయాన్నీ వైజయంతీ మూవీస్ వారు అధికారికంగా ప్రకటించారు.

ఈ సంస్థతో వేదాంస్ పిక్చర్ ప్రొడక్షన్స్ భాగస్వామ్య అయ్యి…ఈ రెండు సంస్థలు కలిసి రోషన్ తో సినిమా చేయబోతున్నాయి. ‘అద్వైతం’ లఘ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న ప్రదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతనికి దర్శకుడిగా తొలి అవకాశం ఇదే. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. ఆ ప్రతిభను గుర్తించే వైజయంతీ బ్యానర్ అవకాశం కల్పిస్తుందని సమాచారం. యాక్షన్ పీరియాడిక్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. త్వరలో సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు వైజయంతీ సంస్థ ద్వారా అధికారికంగా బయటకు రానున్నాయి