టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అరెస్టు

రైతుల పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన గల్లా జయదేవ్‌

MP Galla Jayadev
MP Galla Jayadev

అమరావతి: ఏపి రాజధానిపై జగన్‌ ప్రభుత్వం తీసుకున్న తుది నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన టిడిపి ఎంపీ గల్లా జయదేవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను లాగడంతో ఆయన చొక్కా చిరిగిపోయింది. దీంతో పోలీసుల తీరుపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని అన్నారు. 144 సెక్షన్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ సెక్షన్‌ను అమరావతిలో అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మహిళలను విచక్షణారహితంగా పోలీసులు కొడుతున్నారని ఆయన అన్నారు. పోలీసులు తమ పోరాటాన్ని ఆపలేరని గల్లా జయదేవ్ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/