ఏజెంట్ మూవీ టాక్

అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ గ్రాండ్ గా ఈరోజు విడుదల అయ్యింది. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది. దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. అయితే ప్రస్తుతం ఈ మూవీ కి యావరేజ్ టాక్ వినిపిస్తుంది. సినిమాను చూసిన ప్రేక్షకులు , అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

‘ఏజెంట్ ఫస్టాఫ్ బిలో ఏవరేజ్‌గా ఉంది. ఇందులో వార్నింగ్ ఇచ్చే సీన్‌తో పాటు ఇంటర్వెల్ మినహా అంతా రొటీన్‌గా, సాదాసీదాగా సాగిపోయింది. ముఖ్యంగా పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బాలేదు. హీరోయిన్‌కు లిప్ సింక్ అవలేదు. ఆమె సీన్స్ బోరింగ్‌గా ఉన్నాయి’ అని కొంతమంది అంటుంటే..మరికొంతమంది ‘ఏజెంట్ మూవీ అనేది దాదాపు అన్ని విభాగాల్లోనూ సరైన విధంగా న్యాయం చేయలేక నిరాశ పరిచిన యాక్షన్ సినిమా. బలహీనమైన స్క్రిప్టు, పేలవమైన దర్శకత్వం, మర్చిపోలేని సంగీతంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కఠినమైన అనుభవాన్ని మిగుల్చుతుంది’ అని సోషల్ మీడియా లో తెలుపుతున్నారు. ఓవరాల్ గా సినిమాకు నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తుంది.

ఇక ఈ మూవీ లో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని అందించాడు.