రవితేజ ‘రావణాసుర ‘ ఫస్ట్ డే కలెక్షన్స్

వాల్తేర్ వీరయ్య , ధమాకా చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..నిన్న (ఏప్రిల్ 07) రావణాసుర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించగా అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్ హీరోయిన్స్ గా నటించారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. పరీక్షల ప్రభావం వల్ల కలెక్షన్లు లేవని తెలుస్తుంది. పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే అన్ని భాషల్లో కలిపి కేవలం ఐదున్నర కోట్లు మాత్రం రాబట్టింది.

నాని నటించిన దసరా తొమ్మిదో రోజు కలెక్షన్లను కూడా అధిగమించలేకపోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. రవితేజ గత సినిమాలు ధమాకా రూ. 9.48 కోట్లు, కిలాడీ రూ.6.8 కోట్లు, రామారావు ఆన్ డ్యూటీ రూ. 6.3 కోట్ల మేర ఓపెనింగ్ వసూళ్లను సాధించాయి. ఈ లెక్కన రావణాసురకు మంచి ఆరంభం దక్కలేదని చెప్పాలి. అటు ఓవర్సీస్‌లో కూడా రావణాసుర పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రీమియర్ల ద్వారా 20 వేల డాలర్లు, తొలి రోజు 17 వేల డాలర్లు వసూలు చేసింది. అయితే, వారాంతంలో వసూళ్లు పెరుగుతాయని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.