‘రావణాసుర’ నుండి ఆంథెమ్‌ సాంగ్‌ రిలీజ్

ధమాకా , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న మాస్ రాజా రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో త్వరలో ప్రేక్షకుల ఎందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో.. నావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా ఆంథెమ్‌ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. దశకంఠ లంకాపతి రావణా.. అంటూ సాగే ఈ పాటను హర్షవర్దన్ రామేశ్వర్‌- భీమ్స్‌ సిసిరోలియో కంపోజ్‌ చేయగా.. శాంతి పీపుల్‌, నోవ్‌లిక్‌ పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video