రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తా – అలీ

సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మరోసారి ఎన్నికల్లో పోటీ ఫై క్లారిటీ ఇచ్చారు. గతంలో చెప్పిన మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడినుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని తెలిపారు. రాజమండ్రి నుండే పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఇది నిజమేనా అని మీడియా ప్రశ్నించగా..అదేమీ లేదని అవన్నీ పుకార్లే నని అలీ అన్నారు.

సోమవారం రాజమండ్రిలో ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్బంగా మీడియా ఆలా మాట్లాడారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏడు రాష్ట్రాల జట్లతో ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అలీకి ఘనస్వాగతం లభించింది. అలీపై పూలవర్షం కురిపించారు. క్రికెట్ బ్యాట్ చేతబట్టి కొన్ని బంతులు ఆడిన అలీ… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఈ టోర్నీ జరగడం సంతోషదాయకమని చెప్పుకొచ్చారు. ఇక చిత్రసీమలో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న అలీ, గత ఎన్నికల సమయంలో వైస్సార్సీపీ పార్టీ లో చేరి , పార్టీ విజయానికి తోడ్పడ్డాడు. దీంతో ఆయనకు జగన్ సర్కార్ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి అప్పగించింది.