రేషన్ కార్డు ఉన్నవారు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే కీలకమైన రెండు హామీలను అమలు చేసి ప్రజల్లో నమ్మకం పెంచుకుంది. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇక ఇప్పుడు మిగతా హామీలను పూర్తిచేసే పనిలో పడింది. రీసెంట్ గా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ప్రజల నుండి 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది.

ఇదిలా ఉండగా రేషన్ కార్డ్ ఉన్నవారికి రాష్ట్ర పౌరసరఫరాల అధికారులు కీలక సూచన చేశారు. రేషన్ కార్డుల ఈ కేవైసీని జనవరి 31 లోపు చేయించుకోవాలని తెలిపారు. రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు. అయితే ఆధార్ అప్డేషన్ చేసుకొని వారు ఈకవేసులు నిలిచిపోతాయని హెచ్చరించారు.