ప్రపంచమంతా ఓవైపు పాక్‌ మరోవైపు!

గుట్టుచప్పుడు కాకుండా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితా సవరించిన పాక్‌

Imran-Khan
Imran-Khan

న్యూయార్క్‌: కరోనాతో ప్రపంచదేశాలు పోరాటం చేస్తుంటే పాకిస్థాన్‌ మాత్రం తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంది. నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించింది. దాదాపు 1800 మంది ఉగ్రవాదులను ఈ జాబితా నుంచి తొలగించింది. వాస్తవానికి ఈ జాబితాను ఇప్పటికిప్పుడు సవరించాల్సినంత తీవ్ర పరిస్థితులు ఏమీలేవు. రెండేళ్ల కిందట నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాలో 7,600 మంది పేర్లున్నాయి. ఇప్పుడా జాబితాలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య 3,800 మాత్రమేనంటే పాక్ ఎన్ని విడతలుగా సవరించిందో అర్థమవుతోంది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిందన్న ఆరోపణల నేపథ్యంలో పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ (ప్రపంచ ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్) అసంతృప్తితో ఉంది. పాక్ తీరు ఇదేవిధంగా ఉంటే మరికొన్నాళ్లలో పాక్ ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో చేర్చడం తథ్యమన్న వార్తల నేపథ్యంలో, పాక్ దొంగచాటుగా నిషిద్ధ ఉగ్రవాదుల జాబితాను సవరించినట్టు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/