అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం..పలువురు సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముుఖులకూ ఆహ్వానం

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోడీ

Inauguration ceremony of Ayodhya Ram Mandir..Invitation papers to many celebrities of cinema, politics and sports.

న్యూఢిల్లీః అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు.

కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక మందిని ఆహ్వానించింది. నాలుగు వేల మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులకు ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీక్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

నటీనటులు
అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, సంజయ్‌లీలా భన్సాలీ, అలియా భట్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, అజయ్ దేవ్‌ గణ్, చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, అరుణ్ గోవిల్, దీపికా చిఖలియా

వ్యాపారవేత్తలు
ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా

క్రీడాకారులు
సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ

రాజకీయ నాయకులు
మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి.