ద‌క్షిణాది న‌టిపై అత్యాచారం… వీడియోల‌తో బ్లాక్ మెయిలింగ్!

బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు

Rape on actress
Rape on actress

Bangalore: ద‌క్షిణాదిలోని ప‌లు భాష‌ల‌లో న‌టిస్తున్న న‌టిపై అత్యాచారం జరిగింది.

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెను రేప్ చేసి వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడో కంపెనీ సీఈవో.

దీంతో బాధితురాలు బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత సినీ నటి బెంగుళూరు జేజే నగర్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. ఆమె ఇప్పటికే పలు కన్నడ, తమిళ సినిమాల్లో నటించింది.

ఆమెకు 2018లో బసవగుడి పరిధిలోని గాంధీ బజార్ లోని మోహిత్ అనే వ్యక్తి పరిచయ మయ్యాడు. తాను ఒక కంపెనీకి సీఈవో అని చెప్పుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.

పరిచయమైన కొద్ది రోజులకు ఆమెను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు. ఆమెతో కలిసి గోవా తదితర ప్రాంతాల్లో పర్యటించాడు.

కొన్నాళ్ళకు తన సంస్ధ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని సహాయం చేయాలని కోరుతూ ఆమె వద్ద డబ్బు తీసుకున్నాడు.

2019 జూన్ 22 న తన పుట్టిన రోజు ఉందని చెప్పి ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ మర్నాడే ఆమె పుట్టిన రోజు ఉండటంతో ఇద్దరూ కూడా పార్టీ చేసుకున్నారు.

ఆ సమయంలోనే ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని ఆమె ఆరోపించింది.

తాను డ్రింక్ తాగి మత్తులోకి వెళ్ళిపోయాక తనపై అత్యాచారం చేశాడని దాన్ని తన సెల్ ఫోన్ లో వీడియో తీసి తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది.

గత ఏడాదిగా ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తూ తనను బ్లాక్ మెయిల్ చేస్తూ తన వద్దనుంచి రూ.20 లక్షల వరకు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కోంది.

మోహిత్ బెదిరింపులు ఎక్కువవుతున్న క్రమంలో అతని తల్లి తండ్రులకు విషయం చెపితే వారు కూడా అతడ్నే సపోర్టు చేస్తూ మాట్లాడి తనను బెదరించారని ఆరోపించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహిత్ కోసం గాలిస్తున్నారు. అతడికి మద్దతు ఇచ్చిన తల్లి తండ్రులు నాగమణి,మహదేవ్, మరో కుటుంబ సభ్యుడు రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/