పాక్ ఆయుధ స్మగ్లింగ్ కుట్ర భగ్నం

చినార్‌ కార్ప్స్‌ లెప్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు వెల్లడి

Pak arms smuggling conspiracy foiled
Pak arms smuggling conspiracy foiled

భారత్‌లో విధ్వంసానికి పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రలను మన సైన్యం మరోసారి భగ్నం చేసింది.

నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాల స్మగ్లింగ్‌ ప్రయత్నాన్ని అడ్డుకుంది. జమ్ము-కాశ్మీర్‌ కెరన్‌ సెక్టార్‌లొని కిషన్‌గంగా నది గుండా ఆయుధాలు తరలిస్తుండగా, జవాన్లు గుర్తిం చారు.

ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ట్యూబ్‌లో పెట్టి తాడు సాయంతో నది గుండా భారత్‌లోకి చేరవేసే ప్రయత్నాన్ని ఛేదించారు.

అగంతకులు పారి పోగా, ట్యూబ్‌లోని రెండు బ్యాగులను ఆర్మీ స్వాధీనం చేసుకంది. అందులో నాలుగు ఏకే 74 తుపాకులు, ఎనిమిది మ్యాగ జీన్లు, 240 రౌండ్ల బుల్లెట్‌ ట్యూ బ్‌లు ఉన్నాయి.

పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు చినార్‌ కార్ప్స్‌ లెప్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు వెల్లడించారు.

పాక్‌ సరి#హద్దు వెంబడి 250-300 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు లాంచ్‌ప్యాడ్ల వద్ద పొం చివున్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారని, దీంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/