ఎపిలో 18,697 కేసులు

మృతుల సంఖ్య: 232

coronavirus cases updates
coronavirus cases updates

Amaravati: ఎపిలో నేడు 14 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.. దీంతో ఇప్ప‌టి వ‌రకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 232 కి చేరింది..

మ‌ర‌ణించిన వారిలో క‌ర్నూలు లో అయిదుగురు, అనంత‌లో ముగ్గురు, క‌డ‌ప‌, చిత్తూరు లో ఇద్ద‌రేసి చొప్పున‌, మ‌ర‌ణించ‌గా, కృష్ణా, , విశాఖ‌ప‌ట్నం ఒక్కొక్క‌రు మృతి చెందారు..

ఇక ఎపిలో నేడు 20,567మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 998 మందికి కరోనా నిర్ధారణ అయింది. వాటిలో ఎపిలోని 13 జిల్లాలకు చెందిన వారు 961 మంది ఉండగా, వ‌ల‌స కూలీలు 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒక్క‌రికి కరోనా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఎపిలో మార్చి తొమ్మిదో తేది నుంచి నేటి వరకు మొత్తం 18 వేల 697 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇప్పటివరకు 6 వేల 828 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 1404 మంది, ఎన్నాఆర్ ఐలు 190 మంది కోలుకుని హాస్ప‌ట‌ల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు..

ప్ర‌స్తుతం జిల్లాలలో 9042 యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 226 మంది, వ‌ల‌స కూలీలు 775 మంది వివిద హాస్ప‌ట‌ల్స్ లో చికిత్స పొందు‌తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/