నిర్మల్ జిల్లాలో దారుణం : 60 ఏళ్ల వృద్ధురాలఫై యువకుడు అత్యాచారం

దేశంలో రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల దగ్గరి నుండి పండు ముసలి వారిని సైతం వదలడం లేదు. ఓ పక్క ప్రభుత్వాలు , కోర్టులు , పోలీసులు కఠినశిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తెలంగాణ లోని నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలఫై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది.

నిర్మల్ జిల్లా కు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్య సమస్యలతో మందుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ రోగులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో రోగుల వెయిటింగ్ హాల్ లోనే బెంచీపై పడుకుంది. అక్కడికి ఏదో పని మీద వచ్చిన 23 ఏళ్ల యువకుడు వృద్ధురాలి నిస్సహాయ స్థితిని గమనించి మందులు ఇప్పిస్తానని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలి కేకలు ఎవరికీ వినిపించలేదు. ఘటన అనంతరం యువకుడు అక్కడినుంచి పారిపోయాడు. కాసేపటికే అక్కడికి వచ్చిన కొందరితో ఆమె జరిగిన విషయాన్ని వారితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితురాలి పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితున్ని పట్టుకొని కేసు నమోదు చేశారు.