చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి వర్మ సపోర్ట్

గత వారం రోజులుగా రామ్ గోపాల్ వర్మ పేరు మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఏపీలో సినిమా టికెట్ ధరల పట్ల తన వైఖరిని ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ …జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. తన ట్విట్టర్ ఖాతాలోనే కాకుండా పలు న్యూస్ చానెల్స్ డిబేట్ లలో కూడా పాల్గొంటూ వస్తున్నాడు. ఈ తరుణంలో తాజాగా చిరంజీవి ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉండనని చెప్పడం ఫై తన స్పందనను తెలియపరిచాడు.

చిరంజీవి ఓ సూపర్ స్టార్ అని చెప్పిన వర్మ.. ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించనని ఆయన ఏ కారణంతో చెప్పారో తెలియదు గానీ, ఎంతో కష్టపడి అంత పాపులర్ అయిన ఆయనను పిలిచి ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనే బిరుదు ఇచ్చి, ఆయన టైమ్ వేస్ట్ చేయడమేనేది తప్పు అనేశారు. ఇండస్ట్రీలో అందరికన్నా సక్సెస్‌ఫుల్ పర్సన్ చిరంజీవి కాబట్టి ఆయన పెద్దగా ఉండాలని మీరనుకుంటున్నారు. కానీ ఈ ఇండస్ట్రీలోని గిచ్చులాటలు, దెబ్బలాటలతో ఆయనకేం పని. కాబట్టి చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేనైతే గౌరవిస్తున్నా అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి తానెలా ఉండాలని అనుకుంటున్నాడో అలాగే బ్రతకడంలో తప్పే లేదని వర్మ అన్నారు. మొన్నటి వరకు మెగా ఫ్యామిలీ అంటే పడని వర్మ..ఈ మధ్య మెగా ఫ్యామిలీ ని పొగిడే పని పెట్టుకోవడం మెగా అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. ఉండి..ఉండి ఏ బాంబ్ పేలుస్తాడో అని భయపడుతున్నారు.