అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం ప్రకటించిన జగన్

compensation for asani cyclone victims
compensation for asani cyclone victims

అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అస‌ని తుపాన్ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పటు చేసారు. తుపాన్ బాధితుల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎవ‌రికి ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా వెంట‌నే ఆదుకోవాల‌ని సూచించారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని జ‌గ‌న్‌ ఆదేశించారు.

అసని తుఫాన్‌ బాధితులకు రూ.2 వేలు పరిహారం చెల్లించాలని జగన్ అధికారులకు ఆదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దని… సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తోపాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పని చేసేలా చూడాలని కోరారు. వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించండని.. ఈ నెంబర్లకు బాగా ప్రచారం కల్పించండని ఆదేశాలు జారీ చేశారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశ‌మే అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాల‌ని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. అవ‌స‌రమైన చోట సహాయక‌ పునరావాస శిబిరాలను తెరవాల‌న్నారు.