‘రంగమార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ‘రంగమార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా నిన్న బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా ‘రంగమార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు.
ఇందులో బ్రహ్మానందం తన స్వరంతో చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.