ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త

ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని రేష కార్డు దారులకు శుభవార్త తెలిపారు. ఇక నుండి గోధుమ పిండిని రేషన్ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖలో ప్రారంభించారు. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు.

గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధరను రూ.16 గా నిర్ణయించారు. ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందిస్తోంది. ఒక్కో కార్డుపై రెండు కిలోల వంతున కిలో ప్యాకెట్లను రెండింటిని మంత్రి లబ్దిదారులకు అందించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోంది.. ఇప్పుడు గోధుమ పిండి కూడా చేరింది.