రామారావు నుండి ‘సొట్ట బుగ్గల్లో’ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. ఈ చిత్రంలో రవితేజ కు జోడిగా దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక చిత్ర ప్రమోషన్ లో భాగంగా శనివారం సినిమాలోని ‘సొట్ట బుగ్గల్లో’ సాంగ్ ను రిలీజ్ చేసి ఆసక్తి రేపారు. సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్ కంపోజ్ చేసిన బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ ఇది.

అందమైన లొకేషన్స్ లో రవితేజ మరియు దివ్యాంశ కౌశిక్ లపై చిత్రీకరించబడింది. ‘నేనేనా నేనేనా.. నిన్నా మొన్నా ఉన్నది మరి నేనేనా.. నిన్నేనా నిన్నేనా.. ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేనా..’ అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఈ మెలోడీ గీతంలో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. ఇందులో మజిలీ బ్యూటీని మాస్ రాజా ముద్దులతో ముంచెత్తారు. ఇద్దరి మధ్య కొన్ని ఘాడమైన లిప్ లాక్స్ చూడొచ్చు . యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సి, ఎడిటర్ గా ప్రవీణ్ కేఎల్ పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ”రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు.

YouTube video