భీమ్లా నాయక్‌ నుండి”లాలా బీమ్లా” డీజే వర్షన్‌ వచ్చేసింది..ఇక మోత మోగాల్సిందే

భీమ్లా నాయక్‌ నుండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ”లాలా బీమ్లా” డీజే వర్షన్‌ సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సాంగ్ అందరిని ఆకట్టుకోగా..ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా డీజే వెర్షన్ ను రిలీజ్ చేసి మరింత జోష్ నింపారు మేకర్స్. ఈ డీజే వర్షన్‌ సాంగ్‌ లో పవన్‌ కళ్యాణ్‌ యాక్షన్‌ సీన్స్‌ ను చూపించారు. అలాగే.. ఈ పాట లో పవన్‌ కళ్యాణ్‌ లుంగీలో కనిపించి.. అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాట వింటుంటే.. గూస్‌ బమ్స్‌ వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ – రానా కలయికలో భీమ్లా నాయక్ వస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో మాటల తెరకెక్కుతున్న ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నాగ వంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో పవన్ స‌ర‌స‌న మలయాళ బ్యూటీ నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు స‌ర‌స‌న సంయుక్త మీన‌న్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు..ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ మూవీస్ ఉండడం తో..థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్ల కు ఇబ్బంది గా ఉంటుందని భీమ్లా నాయక్ వెనకడుగు వేసాడు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25 న రాబోతున్నాడు.

YouTube video