అయోధ్య గర్భగుడిలోకి చేరుకున్న బాలరాముడు

అయోధ్య గర్భగుడిలోకి బాలరాముడు చేరుకున్నాడు. ఈ నెల 22 అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా దేశం మొత్తం రామజపం చేస్తూ..రామ కీర్తలనతో మరోమోగిపోతుంది. అయోధ్యలో రామమందిరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అద్భుత శిల్పకళా సంపద, చూడగానే ఆకట్టుకునే హంగులతో అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది. అంతేకాదు ఆలయాన్ని ప్రారంభించేందుకు ఖరారుచేసిన ముహుర్తానికి సమయం దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే రామ మందిర ప్రారంభ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. అయోధ్య మొత్తం రామ కీర్తలనల్తో , రాముడి చిత్రాలతో నిండిపోయింది. ఎటు చేసిన భక్తులతో కనువిందుగా కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇంటిటికి రాముడి అంక్షింతలు చేరుకున్నాయి.

ఈ తరుణంలో గురువారం రాత్రి గర్భగుడిలోకి అయోధ్య బాలరాముడు చేరుకున్నారు. రాముడి రాతి రాళ్లతో చేసిన తామరపువ్వుపై నిలబడి ఉన్న ఈ విగ్రహం బరువు ఒకటిన్నర క్వింటాల్. నూతన ఆలయ గర్భగుడిలోని కూర్మ శిలాపై కొలువుదీరాడు. శ్యామల్’ (black) రాతితో చేసిన 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj) రూపొందించారు. యోగిరాజ్ రామయ్యను కమలంపై నిలబడి ఉన్న ఐదేళ్ల పిల్లవాడిగా చిత్రీకరించారు. కమలం, హాలో కారణంగా, విగ్రహం 150 కిలోగ్రాముల బరువు ఉంటుందని, భూమి నుండి కొలిచినప్పుడు దాని మొత్తం ఎత్తు ఏడు అడుగులు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. అయోధ్య రాముడి ముఖం బయటకు కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పి ఉంచారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఇక 23 నుండి భక్తులు బలరాముడ్ని దర్శించుకోవచ్చు.

అంతకుముందు బుధవారం (జనవరి 18) వివేక్ సృష్టి ట్రస్ట్ నుండి రాంలాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాలయానికి తీసుకువచ్చారు. విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. మంగళవారం (జనవరి 16) ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి.