అట్టహాసంగా హీరో కార్తికేయ పెళ్లి..

RX 100 చిత్రంతో హీరోగా చిత్రసీమలో అడుగుపెట్టిన కార్తికేయ…తన చిన్ననాటి స్నేహితురాలు లోహిత ను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. కార్తికేయ, లోహిత వ‌రంగ‌ల్ ఇంజ‌నీరింగ్ కాలేజ్ నిట్‌లో క‌లిసే చ‌దువుకున్నారు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఏర్ప‌డింది. త‌ర్వాత కార్తికేయ హీరో అయిన త‌ర్వాత వీరి ప్రేమ కొన‌సాగుతూ వ‌చ్చింది. హీరోగా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న కార్తికేయ, లోహిత ఇరువురు త‌మ త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి ఇంటివార‌య్యారు.

పెద్ద‌లు, సినీ సెల‌బ్రిటీలు, స్నేహితులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో లోహిత‌ను హైద‌రాబాద్‌లో కార్తికేయ ఘ‌నంగా వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సహా సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, తనికెళ్ల భరణి తదితరులు విచ్చేసి వధువరులను ఆశీర్వదించారు. కార్తికేయ సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా రాజావిక్రమార్క మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం తమిళ్ లో సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.

Megastar blessed the couple!@ActorKartikeya #Lohitha #bff #wedding #Megastar #chiranjeevi pic.twitter.com/AoId6yaPpG— Manikanth Gelli (@gellimanikanth) November 21, 2021