పాప తనలాగే ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్

పాప తనలాగే ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు రామ్ చరణ్. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా హాస్పటల్ లో ఉన్న ఉపాసన.. నేడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా ఇంటికి వెళ్లేముందు చరణ్ దంపతులు మీడియా తో మాట్లాడారు.

పాప తనలాగే ఉందని , ఏ తండ్రికైనా బిడ్డ ను ఎత్తుకున్నప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుందో తనకు కూడా అదే అనుభూతి కలిగిందన్నారు. తమ కుటుంబసభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారని చరణ్ చెప్పుకొచ్చారు. బిడ్డ కోస తమ కుటుంబ సభ్యులంతా ఎంతో ఎదురు చూశారని అనుకున్న సమయం లో దేవుడు తమ ను ఆశీర్వదించాడని మంగళవారం రోజున బిడ్డ పుట్టడం చాలా సంతోషం గా ఉందన్నారు. ఇక పాప పేరు తాను ఉపాసన మాట్లాడు కొని ఒక పేరు అనుకున్నామని 11వ రోజున కానీ 21వ రోజున కానీ పేరు ప్రకటిస్తామని మీడియా తో చరణ్ తెలిపాడు.