కేటీఆర్ ఇక డ్రామారావు – బండి సంజయ్

గత కొద్దీ రోజులుగా బిజెపి vs తెరాస వార్ నడుస్తుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. నిన్న సోమవారం మంత్రి కేటీఆర్ పాలమూరు లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి బిజెపి ఫై నిప్పులు చెరిగారు. కేటీఆర్ చేసిన విమర్శలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు.

‘ఇయ్యాల నారాయణపేటకు మంత్రి కేటీఆర్ వచ్చిండు. పాలమూరులో వలసలు ఏడున్నయని ప్రశ్నిస్తున్నడు. పచ్చగా ఉన్న పాలమూరులో ఏం సమస్యలు ఉన్నాయని బీజేపీ పాదయాత్ర చేస్తున్నదని అంటున్నడు. ఆయనొక డ్రామారావు” అని బండి సంజయ్ మండిపడ్డారు.

జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్ద ఆదిరాలలో సోమవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. కలెక్టర్ తన పొలంలో దొడ్డు బియ్యమే పడుతుందని కేసీఆర్ చెప్పాడని అంటున్నారని, మరి రైతుల భూముల్లో ఎందుకు మట్టి పరీక్షలు చేయిస్తలేరని ప్రశ్నించారు. కేసీఆర్ భూముల్లో పంటలు పండి, ఆయన కోటీశ్వరుడు కావాలని, పేద రైతులు మాత్రం పంటలు ఎండిపోయి బికారి గాళ్లు కావాలనేదే కేసీఆర్ టార్గెట్ అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.