రెండో పెళ్లి చేసుకుంటా అంటున్న మెగా డాటర్

రెండో పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చారుమెగా డాటర్ నిహారిక కొణిదెల. ఒకసారి ప్రేమ పుట్టి..మళ్లీ ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. ‘ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అవ్వడానికి ఎన్నో కారణాలుంటాయి. అలాంటి కారణాలతోనే నా వివాహం వర్కౌట్ కాలేదు. నాకు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎప్పుడని చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను’ అని స్పష్టం చేసింది.

మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి నటి గా నిహారిక వార్తల్లో నిలిచింది. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ. ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళైన ఏడాదిన్నరకే వీరిద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు కూడా. ఆ తర్వాత నుంచి మెగా డాటర్ తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా… నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను కాబట్టి చేసుకుంటానని చెప్పింది. అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని స్పష్టం చేసింది. అయితే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నప్పటికీ.. ఇప్పుడే అది జరగదని నిహారిక వివరించింది.