మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా న్యూస్ వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ వార్త తో మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి.

చిరంజీవి- సురేఖ ఆనందడోలికల్లో మునిగితేలుతున్నారు. ఇప్పటికే ఇతర కుటుంబ సభ్యుల నుంచి దీనిపై ధృవీకరణ వచ్చింది. త్వరలో మమ్మీ డాడీ కాబోతున్న ఉపాసన- చరణ్ లకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు సామాజిక మాధ్యమాల్లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రామ్ చరణ్ – ఉపాసన ల వివాహం 14 జూన్ 2012 న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆనందం వెల్లివిరియబోతోందని రామ్ చరణ్- ఉపాసన జంట ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నారని తెలుస్తోంది.