బిఆర్‌ఎస్‌ పార్టీపై స్పందించిన సజ్జల

ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని వ్యాఖ్యలు

sajjala-opines-on-kcr-brs-party

అమరావతిః ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీపై స్పందించారు. బిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ కోరితే ఆలోచిస్తామని సజ్జల వెల్లడించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే సీఎం జగన్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు. ఏపీలో బిఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైఎస్‌ఆర్‌సిపికి లేదని సజ్జల స్పష్టం చేశారు. విభజన హామీలపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/