భోళా శంకర్ సెట్ లో సందడి చేసిన మెగా పవర్ స్టార్

భోళా శంకర్ మూవీ సెట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..అదే జోష్ తో భోళా శంకర్ షూటింగ్ లో పాల్గొన్నారు. మెహర్ రమేష్ – చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న ఈ మూవీ వేదాళ‌మ్ రీమేక్‌గా వస్తుంది. ఈ మూవీ లో చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్‌ నటిస్తుండగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా షూటింగ్ మొదలుకాగా..ప్రస్తుతం హైదరాబాద్ శివారు లో వేసిన ప్రత్యేక సెట్ లో సాంగ్ షూటింగ్ జరుపుకుంటుంది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వం లో దాదాపు 200 మంది డాన్స్ మాస్టర్ల తో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సెట్ కు చరణ్ వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. కాసేపు సెట్ లో ఉండి సాంగ్ షూటింగ్ ను ఎంజాయ్ చేశారు. సినిమా తాలూకా విశేషాలను డైరెక్టర్ మెహర్ ను అడిగితెలుసుకున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ మూవీ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.