వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ

న్యూఢిల్లీః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు బదిలీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారుస్తూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని.. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర, ఆధారాలను మాయం చేయడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం.
కాగా, వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో తీర్పు ఇవ్వనున్నట్లు జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వేరే రాష్ట్రానికి కేసు బదిలీపై తీర్పు తర్వాతే సీబీఐ పిటిషన్‌పై విచారణ చేస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం.. కేసు విచారణను డిసెంబరు 2కి వాయిదా వేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/