ఈరోజు నుండే స్ట్రీమింగ్ కాబోతున్న పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 2 కు సంబదించిన స్ట్రీమింగ్ ఈరోజు నుండే ఆహా టెలికాస్ట్ కాబోతుంది. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ తొలి భాగం గత వారం ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంతో సరదాగా సాగింది.

ఇక ఇప్పుడు రెండో భాగం ఫిబ్రవరి 10 నుండి అందుబాటులోకి రాబోతున్నట్లు ముందుగానే ప్రకటించినప్పటికీ..ప్రస్తుతం ఓ రోజు ముందే అంటే ఈరోజు రాత్రి 09 గంటల నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ వార్త తో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. ప్రేక్షకుల ఇష్టాలను గమనించి మరీ ఎపిసోడ్ లను ముందుగా రిలీజ్ చేయడం చాలా మంచి ఆలోచన అని చెబుతున్నారు. మొదటి ఎపిసోడ్ పలు రికార్డ్స్ ను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. మరి రెండో ఎపిసోడ్ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.