మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. ఈరోజు విష్ణు బర్త్ డే సందర్బంగా మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎపిక్ మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోతున్నాయి.

కన్నప్ప సినిమాకి రైటర్ గా మంచు విష్ణు పేరు పడుతుండడం విశేషం. స్టోరీ డెవలప్మెంట్ విషయంలో మంచు విష్ణుకి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ అండగా నిలిచారు. ఇక ఫస్ట్ లుక్ విషయానికి వస్తే..బాణం విల్లుని పట్టుకోని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మంచు విష్ణు కనిపిస్తుండగా..వెనుకాల శివలింగం కనిపించేలా క్రియేట్ చేయడం పోస్టర్ కే హైలైట్ గా నిలిచింది. చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ ..సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు.సినిమా షూటింగ్ మొత్తం న్యూజిల్యాండ్ లోనే జరుగుతూ ఉంది, జనవరి వరకూ అక్కడే ఉండి ఒకేసారి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రావాలి అనేది విష్ణు ప్లాన్.