CliMAXXXXX అంటూ హీరో రామ్ ట్వీట్

బోయపాటి శ్రీను – రామ్ కలయికలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ లో ధమాకా ఫేమ్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే సినిమా తాలూకా చిత్రాలు సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా రామ్ తన ట్విట్టర్ లో అదిరిపోయే అప్డేట్ ఇచ్చి మరింత ఆసక్తి నింపారు.

మొత్తానికి 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్ షూటింగ్‌ పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. CliMAXXXXX అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది రామ్‌- బోయపాటి టీం‌. అయితే ఈ ప్రాజెక్ట్‌ అనుకున్న సమయాని కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఊహాగానాలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది.