అందుకే చైనా కరోనా వ్యాప్తిని దాచింది

ఔషధ నిల్వలు పెంచుకునేందుకే చైనా కరోనా వ్యాప్తిని దాచింది..అమెరికా

China-America
China-America

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుండే వచ్చిందటు అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనా పై అమెరికా మరో తీవ్ర ఆరోపణ చేసింది. దేశంలో ఔషధ నిల్వలు పెంచుకునేందుకే చైనా కరోనా వ్యాప్తి అంశాన్ని దాచిందని అమెరికా పేర్కొంది. వైరస్ తీవ్రత గురించి చైనాకు మొదట్లోనే అర్థమైందని, దాంతో ఆ వైరస్ ను ఎదుర్కోవడానికి అవసరమైన ఔషధాలను నిల్వచేసుకోవాలని భావించిందని అమెరికా ఆరోపించింది.

ఒకవేళ వైరస్ ప్రభావం గురించి బయటి దేశాలకు తెలిస్తే, ఔషధాల కోసం పోటీ ఏర్పడుతుందని భావించి, ఉద్దేశపూర్వకంగానే కరోనా విషయాన్ని ఆలస్యంగా వెల్లడించిందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నివేదికలో పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి పెద్దగా లేదంటూనే దిగుమతుల్ని భారీగా పెంచుకుందని, ఎగుమతుల్ని మాత్రం గణనీయంగా తగ్గించుకుందని ఆ నివేదికలో వివరించారు. ఇతర దేశాల నుంచి చైనా తగినంతగా ఔషధాలు దిగుమతి చేసుకున్నాకే వైరస్ గురించి బయటి ప్రపంచానికి వెల్లడైనట్టు అర్థమవుతోందని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/