రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఈసీ ఉపఎన్నిక నిర్వహించనుంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంది. ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉండగా.. మే 30వ తేదీన పోలింగ్ జరగనుంది. 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించగా.. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనుంది. ఇటీవల బండ ప్రకాశ్​ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభకు రాజీనామా చేశారు. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఈసీ మే 30న ఉపఎన్నిక నిర్వహించనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/