100వ రోజుకు లోకేశ్ యువగళం..పాదయాత్రలో పాల్గొన్ననారా, నందమూరి కుటుంబ సభ్యులు

ఇప్పటి వరకు 1,200 కిలోమీటర్లు నడిచిన లోకేశ్

Nara Lokesh Family Members Join Padayatra Day- 100

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో 1,200 కిలోమీటర్ల యాత్రను లోకేశ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు, లోకేశ్ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వీరిలో నారా భువనేశ్వరి, లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి దేవన్, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కాంటమనేని దీక్షిత, కాంటమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు ఉన్నారు.

మరోవైపు పాదయాత్ర 100 రోజులను పూర్తి చేసుకున్న నేపథ్యంలో లోకేశ్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు షకీలారెడ్డి కలిశారు. లోకేశ్ కు శుభాకాంక్షలు తెలిపారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. బాణసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరుతో పాదయాత్ర జాతరను తలపిస్తోంది. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. 100 రోజుల పాదయాత్రకు గుర్తుగా శ్రీశైలం నియోజకవర్గం మోతుకూరులో పైలాన్ ఆవిష్కరించారు. టిడిపి నేతలు 100 మొక్కలను నాటారు.