మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు కన్నుమూత

రాజోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు (83) కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని సఖినేటిపల్లిలోని స్వగృహానికి తరలించి ప్రజలు, నేతలు సందర్శనార్థం ఉంచారు. గురువారం మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు.

2004-09 మధ్యకాలంలో అల్లూరి కృష్ణంరాజు రాజోలు ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రస్తుతం వైస్సార్సీపీ లో ఉన్నారు. ఆయన తొలిసారి గత 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి ఏవీసూర్యనారాయణ రాజుపై విజయం సాధించారు. అల్లూరి కృష్ణంరాజు భార్య ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వీరికి శ్రీనివాసరాజు, కృష్ణకుమారి, విజయ అనే కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరాజు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్థిరపడ్డారు. ఇక ఈయన మరణం పట్ల సోషల్‌ మీడియాలో రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.