పుష్ప నుండి రష్మిక ఫస్ట్ లుక్

పుష్ప నుండి రష్మిక ఫస్ట్ లుక్

అల్లు అర్జున్ – రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప . రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ సినీ ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పకనే చెప్పాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి లో జరుగుతోంది. ఓ పక్క షూటింగ్ జరుపుతూనే , మరోపక్క సినిమా ప్రమోషన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా రేపు రష్మిక తాలూకా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రేపు ఉదయం 9.45 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రకటన తో పుష్ప ఫాన్స్ లో సందడి మొదలైంది.

శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కాగా.. మలయాళ విల‌క్ష‌ణ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు .