సరిహద్దుల్లో ప్రాజెక్టులపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ సరిహద్దుల వద్ద చేపడుతున్న ప్రాజెక్టులపై సమీక్షించారు. ఢిల్లీలో మంగళవారం సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భారత సరిహద్దుల్లో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న రహదారుల నిర్మాణ పనులను లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ వివరించారు. ఈ సమావేశం గంటకుపైగా కొనసాగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బీఆర్వో సంస్థ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/