లోక్‌సభలో చైనాతో ఉద్రిక్తతలపై ప్రకటన చేయనున్న రాజ్‌నాథ్
సభలో చర్చ చేపట్టాలని విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌సభలో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై కీలక ప్రకటన చేయనున్నారు. అలాగే, చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న పరిస్థితిపై సభలో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని హిమాలయాల సమీపంలో భారత్చైనా సరిహద్దుల వద్ద చైనా శరవేగంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నెట్‌వర్క్‌ను వేస్తున్నారని భారత అధికారులు ఇప్పటికే తెలిపారు.
చర్చలు జరుపుతూనే మరోవైపు సుదీర్ఘ కాలంపాటు ప్రతిష్టంభనను కొనసాగేలా చైనా చేస్తుందని అన్నారు. దాడికి దిగాలంటే చైనాకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన లేహ్‌లోని పాంగాంగ్ టీఎస్ఓ వద్ద ఇటీవల చైనా వేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కనపడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది. మాస్కోలో జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రి జనరల్ వెయి ఫెంగితో రాజ్‌నాథ్ భేటీ అయినప్పటికీ చర్చలు ఫలించలేదన్న విషయం తెలిసిందే.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/