అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి

హైదరాబాద్: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ పార్కుల అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలో అర్బన్ పార్కుల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో 1893 అభివృద్ధి చెందిన అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. ఈ పార్కులతో పాటు అదనంగా మరో 1799 అర్బన్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే 797 పార్కులను అభివృద్ధి చేశామన్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో 587, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 1109, హెచ్ఎండీఏ పరిధిలో 103 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కుల్లో కొన్నింటిని ట్రీ పార్కులుగా, మరికొన్నింటిని ల్యాండ్ స్కేప్, అర్బన్, పంచతత్వ పార్కులుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించమన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/