ఏడో రోజు ప్రారభమైన అసెంబ్లీ సమావేశాలు

TS ASSEMBLY
TS ASSEMBLY

హైదరాబాద్‌: ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం అర గంట పాటు జీరో అవ‌ర్ చేప‌ట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత‌ శాసనసభలో విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై స్వ‌ల్ప కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/