ఏపీ మంత్రి ఉష శ్రీ చరణ్, అనుచరులపై హైకోర్టులో పిల్ దాఖలు

ap high court
ap high court

అమరావతి : ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, అనుచరులు కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువు కబ్జా చేస్తున్నారంటూ హైకోర్టులో పిల్ ధాఖలైంది. కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వరరావు నాయుడు ఈరోజు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సర్వే నంబర్ 329లోని 100 ఎకరాల సుబేదార్ చెరువును లారీలతో మట్టిని తరలించి పూడ్చి ఫ్లాట్‌లాగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారన్న పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టుకు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెండువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

న్యూఢిల్లీ:

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/