రాహుల్ ని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక

Radhika is the mother of Rohit Vemula who met Rahul

Community-verified icon


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కు చేరుకుంది. ఈ సందర్బంగా వేలాదిమంది కార్య కర్తలు , అభిమానులు పాదయాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల రాహుల్ ని కలిసి ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది.

ఆ సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి కూడా వచ్చారు. రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. రాహుల్ తో కలిసి రాధిక పాదయాత్రలో నడిచారు. బీజేపీ, ఆరెస్సెస్ నుంచి మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ ను ఆమె కోరారు. మరోవైపు మీకు పూర్తి న్యాయం చేస్తానని ఈ సందర్భంగా ఆమెకు రాహుల్ హామీ ఇచ్చారు. ఈ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా ఉదయం శంషాబాద్ నుండి ఆరాంఘర్ మీదుగా పురానా పూల్ కు రాహుల్ గాంధీ యాత్ర చేరుకోనుంది. సాయంత్రం పురానాపూల్ నుంచి చార్మినార్ మీదుగా నెక్లెస్ రోడ్ కు యాత్ర చేరుకుంటుంది. ఇక ఏడవ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తంభంపై జాతీయ పతాకాన్ని రాహుల్ గాంధీ ఆవిష్కరించనున్నారు.

ఈరోజు నుండి రెండు రోజులపాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నగరంలో కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్ళించనున్నారు. రెండు రోజులపాటు యాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. నేడు ఆరాంఘర్, బహదూర్ పుర, చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నక్లెస్ రోడ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.