చంద్రబాబు రజనీకాంత్ కలవడం లేదా..? అదంతా ఉత్త పుకారేన..?

స్కిల్ డెవలప్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ను సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని నిన్నటి నుండి సోషల్ మీడియా లో అలాగే మీడియా లో తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలు చూసి అంత నిజమే అనుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చారు రజినీకాంత్ కార్యాలయ వర్గాలు. రజనీకాంత్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారని… రాజమండ్రి వచ్చే షెడ్యూల్ ఏదీ లేదని స్పష్టం చేసింది వ్యక్తిగత సిబ్బంది. దీంతో చంద్రబాబుతో రజనీకాంత్ ములాఖత్ ముచ్చట ఉత్తదేనని అందరూ అంటున్నారు.

ఇటీవల చంద్రబాబు అరెస్టుపై రజనీకాంత్ స్పందించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్‌కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు ఏ తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.