కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు

తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని నేతలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇలా అంత కూడా బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు చేరగా..మరికొంతమంది చేరేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు బీఆర్ఎస్‌ పార్టీని వీడి, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓదేలా భార్య భాగ్యలక్ష్మి ప్రస్తుతం మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

ఈసారి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించగా.. గులాబీ బాస్ కరుణించకపోవడంతో ఆయన బీఆర్‌ఎస్‌ని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంచిర్యాల జెడ్పీచైర్ పర్సన్‌గా ఉన్న తన భార్య భాగ్యలక్ష్మితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. కాగా ఓదేలుతో పాటు.. పలువురు బీఆర్‌ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. కాగా, ఓదేలు, ఆయన భార్య, అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.