నవంబర్‌ 1 నుంచి ఢిల్లీలో తెరుచుకోనున్న అన్ని స్కూళ్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతులకు స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం తెలిపారు. అయితే విద్యార్థుల భౌతిక హాజరు స్వచ్ఛందమన్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలని తల్లదండ్రులను బలవంతం చేయబోమని చెప్పారు. తరగతులు హైబ్రిడ్‌ మోడ్‌లో భౌతికంగాను, ఆన్‌లైన్‌ విధానంలో కూడా ఏకకాలంలో జరుగుతాయని వివరించారు. ఉపాధ్యాయులంతా వంద శాతం వ్యాక్సిన్‌ వేసుకునేలా చూడాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

కాగా, కరోనా నేపథ్యంలో ఢిల్లీలో గత ఏడాది మార్చి నుంచి అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. అయితే ఢిల్లీలో ఇటీవల 9-12 తరగతుల విద్యార్థులకు స్కూళ్లను తెరిచారు. తాజాగా నవంబర్‌ 1 నుంచి అన్ని తరగతుల స్కూళ్లను తెరువాలని బుధవారం జరిగిన ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (DDMA) సమావేశంలో నిర్ణయించారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/